Thursday, June 18, 2009

యజ్ఞోపవీత ధారణం


ముందుగా ఉద్ధరిణితో నీళ్ళు తీసుకొని శిరస్సు మీద జల్లుకొంటూ ఈ క్రింది మంత్రం చదువుకోవాలి
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శ్శుచి:
తరువాత ఆచమనం చెయ్యవలెను
ఆచమ్య ఓం కేశవాయనమః ఓం నారాయణాయనమ: ఓం మాధవాయనమః ఓం గోవిందాయనమః ఓం విష్ణవేనమః ఓం మధుసూదనాయనమ: ఓం త్రివిక్రమాయనమః ఓం వామనాయనమః ఓం శ్రీధరాయనమః ఓం హృషీ కేశాయనమః ఓం పద్మనాభాయనమః ఓం ఓం దామోదరాయనమ: ఓం సంకర్షణాయనమః ఓం ప్రద్యుమ్నాయనమ: ఓం అనిరుద్దాయనమ: ఓం పురుషోత్తమాయనమ: ఓం అదోక్షజాయనమ : ఓం నారసింహాయనమ: ఓం అచ్యుతాయనమ: ఓం జనార్దనాయనామ: ఓం ఉపేంద్రాయనమ : ఓం హరయేనమ: ఓం శ్రీ కృష్ణాయనమ:
 తరువాత నీళ్ళు వెనుకకి జల్లు కోవాలి తరువాత ఈ మంత్రం చదువు కోవాలి
ఉత్తిష్ఠన్తు భూత పిశాచా: ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఓం భూ: ఓం భువ: ఓగుం సువ: ఓం మహా: ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్ సవితు: వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియోయోన: ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోం మామ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శ్రీ మహావిష్నో: ఆజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే  జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ...... సంవత్సరే ....... ఆయనే ..... ఋతౌ ..... మాసే ............ పక్షే ..... తిధౌ ..... వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ శ్రీమాన్ గోత్రః ..... నామధేయః ...... శ్రీమతః ....గోత్రస్య ..... నామధేయస్య మమ ఆయుష్య అభివృద్ధ్యర్ధం సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్థాన జప యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే

యజ్ఞోపవీతానికి పసుపు,కుంకుమ పెట్టాలి.

తరువాత క్రింది మంత్రం చెబుతూ ఒక్కొక్క ముడి వేసుకోవాలి.

మం: యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే : యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:
తరువాత ఆచమనం చేసి పది సార్లు గాయత్రీ మంత్ర జపం చెయ్యాలి.
తరువాత క్రింది మంత్రం చెబుతూ పాత యజ్ఞోపవీతం తీసివేసి పచ్చటి మొక్కమీద వెయ్యాలి.
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం
వేదాంతవేద్యం పరబ్రహ్మరూపం
జీర్ణోపవీతం విసృజస్తు తేజ:

No comments: